జులై 20న వచ్చే స్కంద షష్టి రోజున ప్రత్యేక పూజలు చేస్తే శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అప్పుల నుంచి విముక్తి కోసం ‘కనకధార స్తోత్రం’, సంతానం కోసం ‘సుబ్రహ్మణ్య పంచరత్నం’ పఠించాలంటున్నారు. అలాగే శివాలయాలకు వెళ్లాలని అన్నారు. రెండు తలల నాగరాజు విగ్రహానికి పాలు, నీళ్లతో అభిషేకం చేసి 2 ఖర్జూరాలు సమర్పిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని పండితులు తెలిపారు.