మ్యాన్‌హోల్‌లో అస్థిపంజరం కలకలం

TG: మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని కాటేదాన్‌ ఓల్డ్‌ కర్నూలు రోడ్డులో జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్స్‌ శుభ్రపరుస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో అస్థిపంజరం కనిపించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, అస్థిపంజరాన్ని పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పురుషుడిదా, మహిళదా అనే విషయం ఫోరెన్సిక్‌ పరీక్షలు, దర్యాప్తు తర్వాత తేలుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్