ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన నెయ్యి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే బ్యుటిరేట్ అనే ఫ్యాటీ ఆసిడ్‌కు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి, ఇది కందిన చర్మం, దద్దుర్లకు మందులా పనిచేస్తుంది. విటమిన్ ఎ, ఇ, కె, డిలు చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంచుతాయి. యాంటి ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు పొడిబారిన చర్మానికి తేమను అందించి జీవాన్నిస్తాయి. ముఖానికి స్వచ్ఛమైన నెయ్యిని అరగంట పాటు అప్లయ్ చేసి, ఆ తర్వాత సున్నిపిండితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.