ప్రస్తుత రోజుల్లో చాలామంది అర్ధరాత్రి వరకూ నిద్రకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో శరీరంలోని ముఖ్యమైన అవయవాలు గుండె, కాలేయం, మెదడుతోపాటు మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.అలాగే ప్రతి రోజూ నిద్ర పోయే సమయం మారడం వల్ల శరీరంలో జీవక్రియ, హార్మోన్లు, రక్తంలో చక్కెర నియంత్రణపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. నిద్రపోయే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గిం. ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడంతోపాటు మేల్కోవాలని సూచిస్తున్నారు.