ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటే డేంజర్: నిపుణులు

చాలా మంది రాత్రి వేళల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు. ప్రస్తుతం ఫోన్లలో లిథియం-అయాన్​ బ్యాటరీలు వినియోగిస్తున్నారు. దీని వల్ల ఓవర్ ఛార్జ్ అయినా నష్టం లేదు. అయితే ఇలా చేయొద్దని ఐఫోన్ యూజర్లకు యాపిల్ సూచిస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఫోన్ ఛార్జ్ అయ్యాక దిండు, దుప్పటి కింద పెట్టకూడదు. ఫోన్‌ను వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో ఉంచడం మంచిది.

సంబంధిత పోస్ట్