గుండె వేగం తగ్గితే ప్రమాదమే!

బిజీ లైఫ్‌స్టైల్‌లో నిర్లక్ష్యం చేస్తున్న చిన్న లక్షణాలే బ్రాడీకార్డియా వంటి పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. నిమిషానికి 60 బీట్స్ కంటే తక్కువ గుండె కొట్టుకోవడం బ్రాడీకార్డియాకు సంకేతం. దీనివల్ల ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి సమస్యలు తలెత్తుతాయి. ప్రముఖ కార్డియాలజిస్ట్ పవన్ (ఎయిమ్స్, న్యూఢిల్లీ) ప్రకారం.. నిరంతర అలసట, తలతిరగడం, మూర్ఛపోవడం, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధులు, గుండె జబ్బులు, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, కొన్ని మందులు వాడేవారు అప్రమత్తంగా ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్