కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన ప్రధాన మంత్రి స్వనిధి (పీఎం స్వనిధి) యోజన, వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకాన్ని ఇప్పుడు 2030 వరకు పొడిగించారు. దీని ద్వారా వీధి వ్యాపారులు 15,000, 25,000, 50,000 రూపాయల వరకు మూడు దశల్లో హామీ లేకుండా, 7% వడ్డీ సబ్సిడీతో రుణాలు పొందవచ్చు. అర్హత కలిగినవారు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.