స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయి: నథింగ్‌ సీఈఓ

స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయని నథింగ్‌ సీఈఓ కార్ల్‌ పై తెలిపారు. ప్రత్యేక సేల్స్‌ సమయంలోనూ డిస్కౌంట్లు ఆశించవద్దని ఆయన చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశ్రమ నుంచి డిమాండ్ పెరగడం, మెమరీ ఖర్చులు పెరగడం, చిప్‌ల కొరత ఏర్పడటం వంటి కారణాల వల్ల ధరల్లో మార్పులు వస్తున్నాయని ఆయన వివరించారు. తయారీదారులు త్వరలో ఫోన్ల ధరలను పెంచే అవకాశం ఉందని లేదా ఫీచర్లను తగ్గించే ప్రయత్నం చేస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్