స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. శామ్సంగ్, Xiaomi సంస్థలు 41 మోడళ్ల రేట్లను 18.75% వరకు పెంచాయి. పెంచిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇందులో శామ్సంగ్ 22, Xiaomiకి చెందిన 19 వేరియంట్లు ఉన్నాయి. మోడల్‌ను బట్టి ధర రూ.1,000 నుంచి రూ.4,000 వరకు పెరిగింది. త్వరలో ఒప్పో, వివో, రియల్మీ ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. మెమరీ, ఇతర ముడి సరకుల ధరలు పెరగడంతోనే రేట్లు పెంచుతున్నట్లు ఫోన్ల కంపెనీలు చెబుతున్నాయి.