భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు కాబోయే భర్త, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ మంగళవారం ఉదయం ముంబైలోని ఎస్‌వీఆర్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో సాంగ్లీ ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన ఆయన, మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం స్మృతి-పలాశ్ వివాహం జరగాల్సి ఉండగా, క్రికెటర్ తండ్రి హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత పలాశ్ కూడా అస్వస్థతకు గురయ్యారు.