టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడింది. ఆదివారం మహారాష్ట్ర సాంగ్లిలో ప్రియుడు పలాశ్ ముచ్చల్‌తో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్‌కు ఇవాళ ఉదయం హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా తాజాగా ప్రకటించారు. శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడ్డాకే పెళ్లి చేసుకుంటారని వెల్లడించారు.