TG: పూజ గదిలో పాము ప్రత్యక్షమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన మహేందర్ ఇంట్లోని పూజ గదిలో పాము కనిపించింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతూనే పాలను సమర్పించి భక్తితో మొక్కారు. అనంతరం స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.