బైకులో దూరిన పాము (వీడియో)

AP: నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం పంచాయతీ వవ్వేరు హరిజనవాడలో ఓ బైక్‌పై పాము కనిపించి కలకలం రేపింది. పామును చూసిన మహిళలు భయంతో కేకలు వేశారు. కొంతసేపటికి అది పక్కనే ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వాహనాలు బయట ఉంచే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్