TG: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి కొండపైన భారీ పాము కలకలం రేపింది. కొండ మీద ఉన్న బస్టాండ్‌లో పాము కనిపించడంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అధికారులు వెంటనే స్పందించి, స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. స్నేక్ క్యాచర్ సురక్షితంగా పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టడంతో భక్తులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.