తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా ఉంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. విజయవాడ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.