నానబెట్టిన అంజీర్ తో ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు!

డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ కు ప్రత్యేక స్థానం ఉంది. రుచితో పాటు విటమిన్లు, మినరల్స్ అందిస్తుంది. అంజీర్ ను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల జీర్ణం సులభమై, పోషకాలు త్వరగా గ్రహించబడతాయి. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. పొటాషియం వల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండి ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి, రక్తహీనత దూరమవుతుంది.

సంబంధిత పోస్ట్