నేడే ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం.. సామాజిక మాధ్యమం వరమా, శాపమా?

ప్రతి ఏడాది జూన్ 30న జరుపుకునే ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అనుసంధానించడంలో డిజిటల్ వేదికల పాత్రను గుర్తు చేస్తుంది. 2010లో ప్రారంభమైన ఈ దినోత్సవం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావాన్ని చర్చించే వేదికగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.79 బిలియన్ల మంది సోషల్ మీడియాను వినియోగిస్తుండగా, రోజుకు సగటున 2 గంటల 27 నిమిషాలు గడుపుతున్నారు. విద్య, వ్యాపారం, సమాచార మార్పిడికి సోషల్ మీడియా ఉపయోగకరమైనదే అయినప్పటికీ, తప్పుడు సమాచార వ్యాప్తి, సైబర్ వేధింపులు వంటి సవాళ్లను కూడా తీసుకొస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్