13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించడంతో పాటు టీనేజర్లకు పరిమితులు విధించేందుకు 27 ఐరోపా దేశాల కూటమి సిద్ధమవుతోంది. ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెల్లడించారు. 13-15 ఏళ్ల వారికి సంరక్షకుల పర్యవేక్షణలో పరిమిత ఫీచర్లతో మినీ ఖాతాలకు అనుమతి ఇవ్వాలని సూచించారు. 15-18 ఏళ్ల వారికి ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేక సురక్షిత డిజైన్ రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు.