సోషల్ మీడియాలో వలపు వల.. దంపతుల బాగోతం బట్టబయలు(వీడియో)

TG: సోషల్ మీడియా వేదికగా వలపు వల వేసి.. తమ బుట్టలో పడ్డవారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేపల్లిలో గల శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్లో భార్యాభర్తలు ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సదరు మహిళ నగ్న పొటోలు పోస్ట్ చేసి.. అమాయకులని లొంగతీసికునేది. భర్త అనుమతితో ఆమెతో పలువురు ఏకాంతంగా గడపగా.. రహస్యంగా ఆ వీడియోలు రికార్డ్ చేసేవారు. ఈ వీడియోలతో బెదిరిస్తూ డబ్బులు దోచేవారు. తాజాగా ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి బాగోతం బయటపడింది.

సంబంధిత పోస్ట్