సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య

AP: పశ్చిమగోదావరి జిల్లా తాడేరులో అనంతవాణి (32) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని శ్యాంబాబు అనే ఆటో డ్రైవర్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. ఆమె తనను దూరం పెడుతోందనే కక్షతోనే శ్యాంబాబు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్