విద్యుత్‌ తక్కువ వాడండి: ప్రజలను కోరిన ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. దేశ ప్రజలు విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించాలని కోరింది. విద్యుత్‌ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు తొలిసారి ఇరాన్‌ అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో విద్యుత్‌ సరఫరాపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతుండటంతో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్‌ కొరతను నివారించేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్