తాను చనిపోతూ.. మరో ఐదుగురికి ప్రాణం పోసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

TG: కామారెడ్డికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కుడిక్యాల వినయ్‌ (26) బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఈ నెల 16న ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించినా ఫలితం లేకపోవడంతో వైద్యులు అతన్ని బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో, కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు సేకరించి ఐదుగురికి అమర్చారు. వినయ్ అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ కలిగిందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕