మినుము పంట సాగులో వేరు కుళ్ళు, కాండపు గజ్జి, వడలు తెగుళ్లు రైతులను కలవరపెడుతుంటాయి. అధిక విత్తన మోతాదు, విత్తన శుద్ధి చేయకపోవడం, పంట మార్పిడి పాటించకపోవడం, అధిక తేమ వంటి కారణాలతో ఈ తెగుళ్లు ప్రబలుతుంటాయి. అయితే ఈ తెగుళ్లను నివారించడానికి లోతు దుక్కులు, పంట మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకం, సరైన విత్తన మోతాదు లాంటివి చేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే విత్తన శుద్ధి, ట్రైకోడెర్మా విరిడి వాడకం వంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.