భానుడు మహోగ్రరూపం దాల్చడంతో శక్తివంతమైన సౌర జ్వాలలు వెలువడుతున్నాయని ఇస్రో తెలిపింది. ఈ పరిణామాలను ప్రపంచ అంతరిక్ష సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. సౌర జ్వాలల ప్రభావంతో భారత్‌లో రేడియో బ్లాక్‌అవుట్‌లు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. తీవ్రమైన సౌర తుఫానులు భూమివైపు వస్తే ఉపగ్రహాలు, టీవీ సిగ్నల్స్, రాడార్లు, విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 1న X8.1 స్థాయి సౌర విస్ఫోటనం నమోదైంది. ఆదిత్య-L1 డేటాతో ముందస్తు హెచ్చరికలు జారీ చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.