సౌర తుఫానులు భూమివైపు: ఇస్రో హెచ్చరిక, ఉపగ్రహాలకు ముప్పు

గత కొద్ది రోజులుగా సూర్యుడు శక్తిమంతమైన అగ్నిజ్వాలలను వెలువరిస్తున్నాడు. దీనివల్ల సంభవించే సౌర తుఫానులు భూమివైపు వస్తున్నాయని అంతరిక్ష పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ తుఫానుల వల్ల భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు దెబ్బతినడంతో పాటు, టీవీ సిగ్నల్స్, రాడార్లు, విద్యుత్తు గ్రిడ్‌లు, కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో వెలువడిన సౌర జ్వాలలు విద్యుదయస్కాంత రేడియేషన్‌ను విడుదల చేశాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్