కొనంకి కార్తీక్ ప్రధాన పాత్రలో, శ్రద్ధ ఖత్రి దర్శకత్వంలో కె. వి. నాయుడు నిర్మిస్తున్న 'సోల్జర్ 24x7 ఆన్ డ్యూటీ' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో కార్తీక్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధతకు ప్రతీకగా ఈ చిత్రం రూపొందుతోందని, సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వహిస్తూ దేశ భద్రత కోసం కృషిచేసే భారత సైనికులకు ఇది ఘన నివాళి అని మేకర్స్ తెలిపారు. ప్రియాంక వర్మ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్నారు.