గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన సైనికుడు (వీడియో)

కర్ణాటకలోని బెళగావిలో గురువారం విషాద ఘటన జరిగింది. అనగోల్ బజార్ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల సైనికుడు ఇబ్రహీం‌ సెలవు తీసుకుని స్వస్థలానికి వచ్చాడు. అయితే ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్