తలకిందులుగా చేతులపై నడుస్తూ ఓ జవాన్ జీపును లాగిన వీడియో వైరల్ గా మారింది. క్రమం తప్పకుండా శిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. నైపుణ్యాలను పదునుపెడుతుందని, క్రమశిక్షణ సాధారణ ప్రయత్నాన్ని అసాధారణ నైపుణ్యాలుగా మారుస్తుందని స్పష్టం చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ జవాన్ ను అభినందిస్తున్నారు.