భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ తుపాకితో కాల్చుకున్న జవాన్

ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా శివపురంకొట్టాలుకు చెందిన మురళి (30) రాయ్‌పుర్‌లో 65వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు భార్య పావని, ఇద్దరు పిల్లలతో పాటు తల్లిదండ్రులు, చెల్లి ఉన్నారు. తండ్రి క్యాన్సర్ చికిత్స కోసం రూ.30 లక్షల అప్పు చేశారు. ఈ క్రమంలోనే మురళి ఆదివారం రాత్రి భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్