జవాన్ సోదరి పెళ్లి.. అన్న లేని లోటు తీర్చిన ఆర్మీ (వీడియో)

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆపరేషన్ అలర్ట్‌లో మరణించిన ఆర్మీ జవాన్ ఆశిష్ కుమార్ సోదరి ఆరాధన వివాహాన్ని, అతని రెజిమెంట్ సైనికులు సాంప్రదాయబద్ధంగా జరిపించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఈ వివాహంలో సైనికులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. వధువును మండపానికి తీసుకెళ్లడం, పెళ్లి ఆచారాల సమయంలో తోడుగా ఉండటం, అత్తమామల ఇంటి వద్దకు తీసుకెళ్లడం వంటి అన్నగా చేయాల్సిన అన్ని విధులను వారు నిర్వర్తించారు. ఈ సంఘటనతో వధువు, కుటుంబ సభ్యులు, అతిథులు భావోద్వేగానికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్