TG: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపంచారు. ఈ విషయంలో పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా వివాహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానంటుంటే.. జానారెడ్డి అడ్డుకుంటున్నారని మనసులో మాట బయటపెట్టారు. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది.