మీల్ మేకర్ ప్రోటీన్, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలతో నిండివుంటుంది. కొవ్వు తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే హైపోథైరాయిడ్, కిడ్నీ వ్యాధులు, గౌట్, హార్మోన్ అసమతుల్యత, జీర్ణ సమస్యలు, అలెర్జీ ఉన్నవారు వీటిని తినకూడదని నిపుణులు చెప్తున్నారు. సోయాలో గోయిట్రోజెన్లు, ప్యూరిన్‌లు, ఫైటోఈస్ట్రోజెన్లు వంటి సమ్మేళనాలు శరీరంపై ప్రభావం చూపవచ్చట. అందువల్ల వారు తినకపోవడం మంచిదట.