తల్లిలా నటిస్తూ 77 లక్షల పెన్షన్ మోసం.. కొడుకు అరెస్ట్

ఇటలీలో 56 ఏళ్ల వ్యక్తి తన 85 ఏళ్ల తల్లి మరణించిన తర్వాత కూడా, ఆమెలా వేషం మార్చుకుని మూడేళ్లుగా ఆమె పెన్షన్‌ను పొందుతూ సుమారు 93 వేల డాలర్లు (రూ. 77 లక్షలు) మోసం చేశాడు. తల్లి ఐడీ కార్డు రెన్యూవల్ కోసం రిజిస్ట్రీ కార్యాలయానికి వెళ్లినప్పుడు అధికారులకు అనుమానం వచ్చి, విచారించగా అతను తన మోసాన్ని అంగీకరించాడు. పోలీసులు అతని ఇంట్లో తల్లి మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టుమార్టం తర్వాతే తల్లి మరణానికి అసలు కారణం తెలుస్తోందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్