మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో నవంబర్ 2న ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. చదువు విషయంలో తల్లి మందలించడంతో కోపోద్రిక్తుడైన కొడుకు, తన తల్లిని కర్రతో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత, విషయం బయటకు రాకుండా 72 గంటల పాటు తల్లి మృతదేహంతోనే ఉన్నాడు. మూడు రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.