తల్లిని చంపి.. ఉరేసుకుని కుమారుడి ఆత్మహత్య

TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కన్నతల్లిని కొడుకు బండరాయితో కొట్టి చంపాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుననాడు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతులను పోశమ్మ, శ్రీనివాస్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్