TG మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి(D) కడ్తాల్(M) కర్కల్ పహాడ్ నార్లకుంట తండాకు చెందిన జాతవత్ నరేందర్(40) భార్య సోనితో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి కూలీ పనులు చేస్తున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే నిన్న అనుమానాస్పద స్థితిలో నరేందర్ మృతి చెందాడు. తలకు గాయం ఉండటంతో కోడలు సోని ఆమె సోదరులు రమేశ్, భాస్కర్ కొట్టి చంపారని నరేందర్ తల్లి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.