ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ అయిన యూపీలోని కాన్పుర్‌కు చెందిన వివేక్ శర్మ, అమెరికా స్టార్టప్ కంపెనీ నుండి దాదాపు రూ.2.9 కోట్ల వార్షిక జీతం ఆఫర్‌ను తిరస్కరించారు. తండ్రి అనారోగ్యం, తల్లి క్యాన్సర్‌తో బాధపడుతుండటంతో, వారి సేవలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం భారత్‌లోనే కిరాణా కొట్టు నడుపుతూ, పేద విద్యార్థులకు ఉచితంగా కోడింగ్ నేర్పిస్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. తల్లిదండ్రులకు అండగా నిలబడటమే ముఖ్యమని వివేక్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.