పనికి రమ్మని మందలించినందుకు నాగర్ కర్నూల్‌లో 52 ఏళ్ల తండ్రిని నరికి చంపాడు

పనికి రావాలని మందలించినందు సుల్తాన్ అనే 52 ఏళ్ల వ్యక్తిని తన కొడుకు గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ లోని గట్టునెల్లికుదురులో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. పొలంలో ఎరువు తోలేందుకు రాలేదని తన కొడుకుని మల్లేశ్ ని మందలించాడు. దీనిపై కోపం పెంచుకున్న కొడుకు, తన తండ్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు.తండ్రి ఇటీవల ఎకరం భూమి అమ్మి మల్లేష్‌కు ట్రాక్టర్ కొనిచ్చాడని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్