AP: తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ పరిధిలోని బొబ్బిలంక గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సీతారామరాజు అనే వ్యక్తి తన భార్య లత, అత్త లక్ష్మిలపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. దాడిలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనుక భార్యపై ఉన్న అనుమానమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.