తల్లి తిట్టిందని.. బండరాయితో కొట్టి చంపిన కొడుకు

TG: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోకుల్‌నగర్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. సైకో స్వభావం కలిగిన కుమారుడు రామకృష్ణ, ఆదివారం అర్ధరాత్రి నిద్రలో ఉన్న తల్లి చాకలి భీమమ్మ (65)ను బండరాయితో కొట్టి చంపాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో “అమ్మ నన్ను తిట్టింది కాబట్టి చంపాను” అని రామకృష్ణ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్