పింఛన్ కోసం తల్లిని చంపిన కొడుకు

TG: పింఛన్ డబ్బుల కోసం ఓ కొడుకు తల్లినే హతమార్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో గురువారం జరిగింది. జలాల్పూర్ గ్రామానికి చెందిన సాయిలు పింఛన్ డబ్బు కోసం తల్లి సాయమ్మ (57)తో గొడవకు దిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో కోపానికి గురై పక్కనే ఉన్న కుర్చీతో సాయమ్మ తలపై దాడిచేసి పరారయ్యాడు. దీంతో ఆమెకు తలపై తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్