మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు, ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటసాయి సుశీల్ (18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తల్లిదండ్రులు కృష్ణమోహన్, పద్మ, అత్త ఉదయలక్ష్మి గాయపడ్డారు. కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టడంతో సుశీల్ తల మొండెం వేరైంది. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.