తల్లి చనిపోయినా బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ కాజేసిన కొడుకు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక కొడుకు తన తల్లి చనిపోయినా, ఆమె బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా ఆమె పెన్షన్‌ను కాజేసిన మోసం వెలుగులోకి వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధుడి భార్య శాంతి దేవి 2018 డిసెంబర్ 9న మరణించినప్పటికీ, ఆమె కుమారుడు ప్రేమ్ సింగ్ నకిలీ పత్రాలతో బ్యాంకులో సమర్పించి, తల్లికి వచ్చే పెన్షన్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో సుమారు రూ. 44 లక్షలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒక ఫిర్యాదుతో బయటపడిన ఈ వ్యవహారంలో, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ప్రేమ్ సింగ్‌తో పాటు సహకరించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్