తెలుగు సినిమా దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, పవన్ కళ్యాణ్‌తో 'ప్రిన్స్ ఆఫ్ పీస్' అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. ఏసు క్రీస్తు జీవిత కథ ఆధారంగా రూపొందించాలనుకున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 2010లో ప్రకటించబడింది. పవన్ కళ్యాణ్, అనుష్క శెట్టి నటించాల్సి ఉండగా.. కథా రచనకు రెండేళ్లు పట్టడం, పవన్ ఇతర సినిమాలతో బిజీ కావడం, ఇజ్రాయెల్, జెరూసలేం వంటి లొకేషన్ల వల్ల బడ్జెట్ పెరిగిపోవడంతో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది.