జలప్రళయంతో నేపాల్ అతలాకుతలం అయింది. ఆకస్మిక వరదలతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో అక్కడి వరద బాధితులను ఆదుకునేందుకు నటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు. ఈ మేరకు నేపాల్ వరద ప్రాంతాల్లో పర్యటించినట్లు ఆయన తెలిపారు. అక్కడి దృశ్యాలను చూసి చలించిపోయానని, బాధిత కుటుంబాలను ఆదుకుంటానని, వారి జీవితాల్లో మళ్లీ ఆశలు నింపుతానని ఆయన హామీ ఇచ్చారు. బాధితుల పునరావాసానికి తనవంతు సాయం అందిస్తానని అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.