భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటిస్తున్నాడు. ఈ విషయాన్ని రాజ్ కుమార్ రావు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. లవ్ రంజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తున్నారు. గంగూలీ పాత్ర కోసం రాజ్ కుమార్ రావు 9-10 కిలోలు బరువు పెరిగినట్లు తెలిపారు.