ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న పేసర్ మహమ్మద్ షమీని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరుతున్నారు. బెంగాల్ ప్రో టీ20 లీగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గంగూలీ, షమీ ఫిట్‌నెస్, ఫామ్‌ను ప్రశంసిస్తూ, జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి కొత్త బంతితో బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి జట్లకు ధీటుగా నిలబడతాడని అభిప్రాయపడ్డారు. షమీ రంజీ ట్రోఫీలో ఆడాలనే నిర్ణయాన్ని కూడా సమర్థించిన ఆయన, త్వరలో అతన్ని మళ్లీ భారత జట్టు కోసం ఆడటం చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.