విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో సౌతాఫ్రికా 270 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో ఓపెనర్ డీకాక్ సెంచరీ (106)తో రాణించారు. కెప్టెన్ బవుమా 48, బ్రెవిస్ 29, బ్రీట్టేకే 24 రన్స్ చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, ప్రసిద్ద్ క్రిష్ణ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్, జడేజా తలో వికెట్ తీశారు. భారత్ విజయానికి 271 రన్స్ అవసరం.