మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా విశాఖలో జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో బ్యాటింగ్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా 18 పరుగులకే రెండో వికెట్‌ను కోల్పోయింది. సునె లుజ్ (5)ను భారత బౌలర్ అమన్‌జ్యోత్ కౌర్ ఔట్ చేసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు కష్టాల్లో పడినట్టైంది.