కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో గెలిచింది. సుందర్ 31, అక్షర్ 26, జడేజా 18 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సెకండ్ ఇన్నింగ్సులో గిల్ బ్యాటింగ్ కు రాలేదు. SA బౌలర్లలో హార్మర్ 4, జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టారు.